దేశంలో 10 కోట్లు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,366 కేసులు నమోదవ్వగా మరో 690 మంది చనిపోయారు. వీటితో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312 కు చేరగా..మరణాల సంఖ్య 1,17,306 కు చేరింది. నిన్న ఒక్కరోజే దేశంలో 73,979 మంది రికవరీ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 69,48,497 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 6,95,509 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

మరో వైపు దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 14,42,722 మందికి టెస్టులు చేశారు. వీటితో  అక్టోబర్ 22 వరకు కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 10కోట్ల,లక్షా13 వేల85 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Latest Updates