మొత్తం బడ్జెట్ రూ.27లక్షల కోట్లు… పన్నుల్లో రాష్ట్ర వాటా ఎంతంటే..?

total-budget-allocation-is-27-lack-crores-252387-2

మొత్తం రూ. 27 లక్షల 33వేల కోట్ల రూపాయలతో 2019 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం వినిపించారు. ప్రాధాన్య రంగాల గురించి, కేటాయింపుల గురించి వివరాలు తెలిపారు.

కేంద్రానికి పన్నులతో వచ్చే ఆదాయం.. అందులో రాష్ట్రాల వాటా వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదాయ రశీదులు రూ.22.48 లక్షలు

పన్నేతర ఆదాయం రూ.5.95 లక్షల కోట్లు

ప్రత్యక్ష పన్నుల నుంచి వచ్చే రెవెన్యూ రూ.13.22 లక్షల కోట్లు

కార్పొరేట్ పన్నులు రూ.7.66లక్షల కోట్లు

ఆదాయపు పన్ను – రూ.5.57 లక్షల కోట్లు

పరోక్ష పన్నులు – రూ.11.22లక్షల కోట్లు

మొత్తం పన్నులతో వచ్చే ఆదాయం రూ.24.61 లక్షల కోట్లు

పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా రూ.8.09లక్షల కోట్లు

కేంద్రం వాటా రూ.16.52లక్షల కోట్లు

పన్నులతో తెలంగాణకు వచ్చే ఆదాయం రూ.19,471 కోట్లు.

Latest Updates