ఏపీలో ఒక్కరోజే 81 కేసులు

  •  1097కి చేరిన కేసులు
  • డిశార్జ్‌ అయిన వారు 60 మంది

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి రోజు రోజుకు వణికిస్తోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 81 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పుడు ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. వ్యాధి నుంచి కోలుకుని ఆదివారం ఒక్కరోజే 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 835 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 31 చనిపోయారు. కాగా.. 24 గంటల్లో కోరోనా వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
ఏపీలోని జిల్లాల వారీగా కేసుల వివరాలు

Latest Updates