ఇంజనీరింగ్ ఎంసెట్​ టాప్​ టెన్​లో.. మొత్తం అబ్బాయిలే

  • రిజల్ట్స్ రిలీజ్ చేసిన మంత్రి సబితారెడ్డి
  • మొత్తం 75.29 శాతం మంది క్వాలిఫై

 

హైదరాబాద్, వెలుగుటీఎస్ ఎంసెట్(ఇంజనీరింగ్)లో అబ్బాయిలు హవా కొనసాగించారు. టాప్ టెన్ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు తెలంగాణ వారుండగా, మరో ఐదుగురు ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని  జేఎన్‌టీయూహెచ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తో కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు.

కరోనాతో రాయనివారికి 8న ఎగ్జామ్

కరోనా వల్ల ఎగ్జామ్ కు హాజరుకాని వారికి ప్రత్యేకంగా ఈ నెల 8న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఎల్బీనగర్​లోని ఐయాన్ సెంటర్ లో ఎగ్జామ్ ఉంటుందన్నారు.  ఇప్పటి వరకు దాదాపు 85 మంది అప్లై చేసుకున్నారని చెప్పారు.పోయిన నెలలో జరిగిన ఎంసెట్ కు మొత్తం 1,43,326 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,19,183 మంది ఎగ్జామ్ రాశారు. వీరిలో 89,734 (75.29 శాతం) మంది క్వాలిఫై కాగా..  29,449 మంది అర్హత సాధించలేదు. క్వాలిఫై అయిన స్టూడెంట్లలో 80,728 మందికే ర్యాంకులు కేటాయించారు.

117 మందికి 121కి పైగా మార్కులు

క్వాలిఫై అయిన స్టూడెంట్లలో 121–160 మార్కులు వచ్చినోళ్లు 117 మంది,  81–120 మార్కులు వచ్చినోళ్లు 3,409 మంది, 40–80 మార్కులు వచ్చినోళ్లు 79,201 మంది ఉన్నారు. 40 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 7,007 మంది ఉన్నారు. 74,504 మంది అబ్బాయిలు ఎగ్జామ్ రాయగా.. 48,781 మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 44,678 మంది రాస్తే.. 31,947 మంది క్వాలిఫై అయ్యారు. ఓ ట్రాన్స్ జెండర్ ఎగ్జామ్ రాసినా క్వాలిఫై కాలేదు. ఇంటర్ బోర్డు నుంచి 1,16,918 మంది ఎగ్జామ్ రాస్తే.. 29,042 మంది క్వాలిఫై కాలేదు. సీబీఎస్ఈ నుంచి 1,607 మంది రాయగా 234 మంది, ఐసీఎస్ఈ నుంచి 114 మందికి గానూ 22 మంది, ఇతర బోర్డుల వారు 544 మంది రాయగా 151 మంది క్వాలిఫై కాలేదు. అయితే అర్హత సాధించిన వారిలో 40 నుంచి 80 మార్కులు సాధించిన వారే  79,201 మంది ఉండటం గమనార్హం.

80,728 మందికి ర్యాంకులు

ఓసీ కేటగిరీలో 41,062 మంది ఎగ్జామ్ రాయగా 28,101 మంది ర్యాంకులు సాధించారు. ఎస్సీలు 11,535కు గాను 9,578 మంది, ఎస్టీలు 7,030 మందికి గాను 6,009 మంది, బీసీ(ఏ)లో 7,585 మందికి గాను 4,687 మంది, బీసీ(బీ)లో 23,988 మందికి గాను 15,331 మంది, బీసీ(సీ)లో 678 మందికి గాను 442 మంది, బీసీ(డీ)లో 20,725 మందికి 13,071 మంది, బీసీ(ఈ)లో 6,580 మందికి 3,509 మంది ర్యాంకులు పొందారు. మొత్తం 9,695 మంది మైనార్టీ స్టూడెంట్లు ఉండగా 5,120 మందికి ర్యాంకులు వచ్చాయి.

ఉన్నత స్థాయికి చేరుకోవాలి: మంత్రి

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో ఎగ్జామ్ నిర్వహించామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. మంచి కాలేజీ, కోర్సులను ఎంచుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. ‘‘మీ భవిష్యత్ ​మీ చేతిలోనే ఉంది. మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి” అని అన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఎంసెట్ కో–కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.

9 నుంచి కౌన్సెలింగ్ స్టార్ట్

ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా 36 కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కౌన్సెలింగ్​టైమ్ లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్​లో ఇబ్బందులను తొలగించేందుకు రెవెన్యూ సర్వర్​తో లింక్ చేసినట్టు తెలిపారు. క్యాస్ట్, ఇన్​కం సర్టిఫికెట్ల నెంబర్లను ఎంటర్ చేస్తే, పూర్తి వివరాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఫస్ట్​ఫేజ్​లో ఈ నెల 9 నుంచి17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవాలని..12 నుంచి 18 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే, 22న ఫస్ట్​ఫేజ్ సీట్లను అలాట్మెంట్ చేస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో కాలేజీల అఫిలియేషన్లు, సీట్లపై స్పష్టత వస్తుందన్నారు.

 

Latest Updates