తమిళనాడులో 26 నుంచి పూర్తి లాక్‌డౌన్‌

  • ఐదు సిటీల్లో విధించనున్న సర్కార్‌‌

చెన్నై: కరోనా చైన్‌ను బ్రేక్‌ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు సిటీల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రకటించారు. చెన్నై, మదురై, కోయంబత్తూర్‌‌లో ఈ నెల 26 ఉదయం 6 గంటల నుంచి 29 రాత్రి 9 గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ ఉంటుంది. తిరుపూర్‌‌, సేలంలలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. హాస్పిటల్స్‌, రాష్ట్ర ప్రభుత్వం నడిపే షాపులు, అమ్మ క్యాంటిన్లు, ఏటీఎంలు, హోమ్‌ డెలివరీ ఇచ్చే రెస్టారెంట్లు తప్ప మిగతా అన్నీ క్లోజ్‌ ఉంటాయని అన్నారు. హాట్‌స్పాట్‌లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1683 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 752 మంది కోలుకున్నారు. 20 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు.

Latest Updates