ఇండియాలో 107కు చేరిన కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో రోజు రోజుకు విస్తరిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. కేంద్ర  లెక్కల ప్రకారం  మార్చి 15 మధ్నాహ్నం 12 గంటల వరకు కోవిడ్- 19 బాధితుల సంఖ్య విదేశీలయులతో పాటు 107కు చేరింది. ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా విస్తరించకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, స్కూల్స్, సినిమా థియేటర్స్ బంద్ పెట్టారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచించారు.

Latest Updates