ఒక్క రోజులో 1813 క‌రోనా కేసులు.. 71 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1813 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఈ ఒక్క రోజులో 71 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. దీంతో బుధ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు మొత్తం 31,787 క‌రోనా కేసుల న‌మోదైన‌ట్లు చెప్పింది. అందులో 1008 మంది మ‌ర‌ణించ‌గా.. 7797 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డిచింది. ప్ర‌స్తుతం 22,982 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 9318 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 400 మంది మ‌ర‌ణించ‌గా.. 1388 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుజ‌రాత్ లో 3774, ఢిల్లీలో 3314 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2561, రాజ‌స్థాన్ లో 2364, యూపీలో 2115, త‌మిళ‌నాడులో 2058 మందికి వైర‌స్ సోకింది. ఏపీలో 1332, తెలంగాణ‌లో 1012 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో క‌రోనా పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఒక‌రు, గోవా ఏడుగురు, మ‌ణిపూర్, త్రిపురల్లో ఇద్ద‌రు చొప్పున క‌రోనా బారిన‌ప‌డగా.. వారంతా చికిత్స అనంతం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆ రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుంచి కొత్త‌గా కేసులు రాక‌పోవ‌డం ఊర‌ట‌నిస్తోంది.

Latest Updates