భారత్‌లో కరోనా బాధితులు 137.. రాష్ట్రాల వారీగా లిస్ట్..

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది.  ఇండియాలో విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య ఇవాళ సాయంత్రం 5.15 గంటల వరకు 137 కు చేరింది. ఇందులో విదేశీయులు 24 మంది ..113 మంది భారతీయులు. 14 మంది డిశ్చార్జ్ కాగా ముగ్గురు చనిపోయారు.

ఇప్పటికే  దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. వైరస్ విస్తరించకుండా ఆయా రాష్ట్రాలు ముందస్తుగా హై అలర్ట్ ప్రకటించాయి. విద్యాసంస్థలు, థియేటర్స్, టూరిస్ట్ స్పాట్స్,  టెంపుల్స్ మూతబడ్డాయి. తాజ్ మహల్ సందర్శనను కూడా నిలిపివేశారు. అటు తమిళనాడులోని ఊటీలో టూరిస్టులు ,హోటళ్లు,రిసార్ట్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు

 • ఆంధ్రప్రదేశ్                   1
 • ఢిల్లీ                             8
 • హర్యానా                     15
 • కర్ణాటక                       11
 • కేరళ                           26
 • మహారాష్ట్ర                    39
 • ఒడిశా                         1
 • పంజాబ్                       1
 • రాజస్థాన్                      4
 • తమిళనాడు                  1
 • తెలంగాణ                      5 (4+1 విదేశీయులు)
 • జమ్మూ అండ్ కాశ్మీర్      3
 • లడఖ్                           6
 • ఉత్తరప్రదేశ్                    15
 • ఉత్తరాఖండ్                   1

Latest Updates