అక్టోబర్ 15వరకు హోటళ్లు,రెస్టారెంట్ల మూసివేతపై స్పందించిన కేంద్రం

అక్టోబర్ 15వరకు హోటళ్లు,రెస్టారెంట్లు మూసివేత అంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్ 15వరకు దేశంలో అన్నీ హోటల్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నారంటూ ఓ లేఖ వైరల్ అవ్వడం హాట్ టాపిగ్గా మారింది. ఈ లేఖపై కేంద్రప్రభుత్వం స్పందించింది.

కరోనా వైరస్ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలవుతుంది. పర్యాటక రంగంలో నెలకున్న భయాందోళనల వల్ల  అక్టోబర్ 15,2020 వరకు హోటళ్ళు / రెస్టారెంట్లు మూసి ఉంటాయంటూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఓ నకిలీ లేఖను పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ స్పందిస్తూ హోటళ్లు , రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తల్ని నమ్మొద్దంటూ సూచించింది. నకిలీ లేఖపై  ముంబై  సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని తెలిపింది.

ఫేక్ న్యూస్ పై కేంద్ర ఆగ్రహం

ఫేక్ న్యూస్ ను  క్రియేట్ చేస్తున్న నిందితులపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ వార్తల్ని వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Latest Updates