గోదావరిలో నీట మునిగిన బోటు.. పర్యాటకులు గల్లంతు

Tourist boat capsizes in Godavari river in Devipatnam, East Godavari district.

తూర్పున గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటకులతో పాపికొండలు వెళుతున్న  ఓ బోటు నీటమునిగింది.  దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద  ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద జరిగిన సమయంలో ఆ బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.  ఈ ఘటనలో 27 మంది సురక్షితంగా బయటపడ్డారని, మిగిలిన వారంతా గల్లంతయ్యారని  సమాచారం.  ప్రయాణికులంతా లైఫ్ జాకెట్లు ధరించారని, కొంత మంది లైఫ్‌ జాకెట్లతో గ్రామస్థుల సహాయంతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

బోటు ప్రమాదం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు రంగంలోకి దిగారు.

Latest Updates