బీచ్ లో బికినీ వేసుకుందని ఫైన్.. ఇదో ఆర్ట్ అన్న యువతి

  • స్ట్రింగ్ బికినీ సరికాదన్న టూరిస్టులు.. ఇదో ఆర్ట్ అని చెప్పిన యువతి
  • తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న పోలీసులు

విహార యాత్రకు వెళ్లిన జంటకు తోటి టూరిస్టులు షాకిచ్చారు. మరీ అసభ్యంగా.. స్ట్రింగ్ బికినీ వేసుకుందంటూ యువతిని పోలీసులకు పట్టించారు. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఆ జంటను హెచ్చరించి రూ.3 వేల ఫైన్ వేశారు పోలీసులు.

ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిందీ ఘటన. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి విహారయాత్రకు వచ్చిందో తైవాన్ యువతి. సముద్రపు ఒడ్డున విహరిద్దామని.. స్ట్రింగ్ బికినీ వేసుకుని బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ లోకి వచ్చిందా యువతి. అయితే ఆమె వేసుకున్న బికినీలో నాలుగు దారపు పోగులు తప్ప ఏమీ లేదని బీచ్ లోని టూరిస్టులు అభ్యంతరం చెప్పారు. మరో డ్రస్ వేసుకోవాలని చెప్పినా.. ఆమె వినకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీచ్ లోకి వచ్చిన పోలీసులు అసభ్యంగా తిరగడం సరికాదని ఆ జంటకు చెప్పారు. కానీ, ఆ యువతి వారి మాటలను లెక్క చేయకుండా ‘ఇదో ఆర్ట్’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు వారికి దాదాపు రూ.3100 ఫైన్ వేశారు. తమ దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని, మిగతా టూరిస్టులకు ఇదో మెసేజ్ లాంటిదని అన్నారు.

బీచ్ లోకి వెళ్లే ముందే వారుంటున్న రిసార్టు సిబ్బంది కూడా ఆ డ్రస్ తో బయటకు పోవద్దని సూచించారు. అయినా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లోకి వెళ్లింది. చివరికి జరిమానా వేయించుకుంది.

Latest Updates