శ్రీశైలం -హైదరాబాద్ హైవేపై  పెద్దపులి

శ్రీశైలం -హైదరాబాద్ హైవేపై  పెద్దపులి

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్​ ఫారెస్ట్​లోని శ్రీశైలం – హైదరాబాద్ హైవే పై బుధవారం సాయంత్రం పర్యాటకులకు పెద్ద పులి కనిపించింది. అమ్రాబాద్ రేంజర్ ప్రభాకర్ కథనం ప్రకారం... ఏటీఆర్ లోని శ్రీశైలం – హైదరాబాద్ రహదారి ఫరహాబాద్ నుంచి వటవర్లపల్లికి వెళ్లే జాతీయ రహదారిపై బోరెడ్డి బాయి సమీపంలో సాయంత్రం వేళలో ఓ ఆడపులి రోడ్డు దాటింది. శ్రీశైలం వెళుతున్న పర్యాటకులు ఇది చూసి వీడియోలు, ఫొటోలు తీశారు. ఈ పులి పేరు సూపర్ మదర్​టైగర్ అని, ఏడేండ్లుగా 7 నుంచి 8 పిల్లలకు జన్మనిచ్చిందని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెప్పారు.