టూరిస్టులతో కళకళలాడనున్న జమ్ముకశ్మీర్

కొన్ని నెలల తర్వాత జమ్మూకశ్మీర్ లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేసి, విద్రోహ శక్తులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కశ్మీర్ లో పర్యటించేందుకు రాజకీయ పార్టీల నేతలను కూడా అనుమతించలేదు. ఈ క్రమంలో రెండు నెలల తర్వాత జమ్మూకశ్మీర్ లోకి ఈ రోజు(గురువారం) నుంచి మళ్లీ పర్యాటకులను అనుమతిస్తున్నారు. దీంతో మళ్లీ టూరిస్టులకు జమ్ముకశ్మీర్ కనువిందు చేయనుంది.

అంతేకాదు జమ్మూకశ్మీర్ లో పర్యటించాలనుకుంటున్న టూరిస్టులకు అవసరమైన సహాయసహకారాలను పూర్తిగా అందిస్తామని ఆ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

Latest Updates