రోడ్డు ప్రమాదం: రెండు లారీల మధ్య చిక్కుకున్న వ్యక్తి సేఫ్

ఒకే వైపు వెళ్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన బుధవారం పొద్దున సంగారెడ్డి జిల్లా శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో జరిగింది. అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి రెండు లారీల మధ్య ఇరుక్కున్నాడు. అయితే ఆ వ్యక్తికి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. ప్రమాదానికి గురైన లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Latest Updates