ఆరుగురిని మింగిన సెప్టిక్ ట్యాంక్

తమిళనాడులో విషాద సంఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తూ విషవాయువు పీల్చుకుని ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్లర్లు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరగింది. ముందుగా సెప్టిక్ ట్యాంకులో క్లీనింగ్ కోసం దిగిన కృష్ణమూర్తి అనే వ్యక్తి విషవాయువు పీల్చుకుని కుప్పకూలాడు.

అతడిని కాపాడటానికి వచ్చిన కృష్ణమూర్తి కొడుకులు కన్నన్, కార్తీక్ లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు పరమశివన్, సురత్ భాయ్, లక్మి కాంతన్ లు కూడా విషవాయువు పీల్చడంతో చనిపోయారని తెలిపారు స్థానికులు. విషవాయువు పీల్చిన మరో ముగ్గురు ఉక్కిరిబిక్కిరై కుప్పకూలడంతో వారిని వెంటనే హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు.

Latest Updates