కాలుష్యపు నురగలు: విషపూరితంగా మెరీనా బీచ్

తమిళనాడు: చెన్నైలోని మెరీనా బీచ్ కాలుష్యపు నురగలతో నిండిపోయింది. కలుషితపు నీటితోనే ఇలాంటి నురగలు ఏర్పడుతాయని చెప్తున్నారు డాక్టర్లు. ఆనీటి వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయని చెప్పారు.  బీచ్ వెంబడి కిలోమీర్లకొద్ది నురగలు వ్యాపించి ఉన్నాయి. స్థానికంగా ఉండే పిల్లలు ఆ నురగలతో ఆడుకుంటూ… సెల్ఫీలు తీసుకుంటున్నారు.

తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి నురగ నమూనాలను సేకరించింది. అయితే… 2017లో బీచ్ లో ఏర్పడిన పొల్యూషన్ వల్ల చాలా చేపలు చనిపోయాయి. అది మళ్లీ జరుగకుండా అధికారులు అలెర్ట్ అయ్యారు. తగు చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. స్థానిక జాలర్లు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొన్ని రోజులపాటు తమ దగ్గర ఎవరూ చేపలు కొనరని తమ జీవనాదారం కోల్పోయామని చెప్పారు.

Latest Updates