కేటీఆర్ ను టమాటా, గుడ్లతో కొట్టండి

కేటీఆర్ ను టమాటా, గుడ్లతో కొట్టండి

నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. అయితే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ను అడ్డుకోవాలని, టమాటా, గుడ్లతో కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు.  జూబ్లీ హిల్స్ లో  ఇవాళ ఉదయం నుంచి రేవంత్ ఇంటిదగ్గర భారీగా బలగాలను మొహరించారు పోలీసులు. హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిలోకి ఎలా వస్తారని ఏసీపీని ప్రశ్నించారు. మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవెల్లి రచ్చబండ సందర్భంగానూ రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి:

కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా? 

ఒమిక్రాన్పై హైకోర్టు కీలక ఆదేశాలు