ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు

గవర్నర్, హైకోర్డు తిట్టినా సీఎం కేసీఆర్ కు సిగ్గులేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నట్టు హైకోర్టు చెప్పిందని..యశోద ఆసుపత్రిలో  కేసీఆర్ వాటా ఎంత? అని ప్రశ్నించారు. ప్రవేటు ఆసుపత్రులతో సీఎం కేసీఆర్ లాలూచీ పడుతున్నాడని ప్రాజెక్ట్ లల్లో కమీషన్ కోసం దోచుకొన్నది చాలదా కేసీఆర్..? అన్నారు. ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదని..ఇదో మొదనాష్టపు ప్రభుత్వం అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుడు రిపోర్ట్ లు ఇవ్వమని చెప్పింనదుకు హుజురాబాద్ లో ప్రవీణ్ యాదవ్ ఉద్యోగం తీశారని సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. ప్రవీణ్ యాదవ్ ను ఈటల రాజేందర్…ఆసుపత్రి సూపర్డేండెంట్ లే చంపించారన్నారు. ఈటల రాజేందర్ పై  DGP కేసులు పెట్టాలని..ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్ లో ని ప్రభుత్వ ఆసుపత్రిలో  సగం సిబ్బంది కూడా లేరన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని…జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతాం అన్నావ్ ఏమైంది..? అని కేసీఆర్ ను ప్రశ్నించారు ఉత్తమ్.

 

 

Latest Updates