ఢిల్లీలో మద్దతిస్తూ.. హైదరాబాద్‌‌లో విమర్శలా?

హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎంతో గొప్పవాడని.. కానీ నేటి పాలకులు రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతు సంఘాల పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ దుర్వినియోగానికి పాల్పడుతోందని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందంతో పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో కేంద్రానికి మద్దతిస్తున్న సీఎం కేసీఆర్.. ఇక్కడ మాత్రం విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎంత దారుణంగా ఉందో మేధావులు, విద్యావంతులు ఆలోచించాలన్నారు.

Latest Updates