రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇలా చేయండి

కరోనా నేపథ్యంలో జూన్ 19న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హంగులు, ఆర్భాటాలు చేస్తూ కేక్ కటింగ్ లు చేయొద్దని ఆయన అన్నారు. అందుకు బదులుగా పేదలకు సహాయం అందించాలని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుంది. ప్రతిపక్షాల నాయకుల అణచివేతకు పాల్పడుతోంది. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను పక్కన పెట్టింది. తెలంగాణ వచ్చాక పాత ప్రాజెక్టులను పట్టించుకోకుండా .. కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులను నిబంధనల ప్రకారం సందర్శించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే గృహ నిర్బందాలు, అరెస్టులూ చేస్తూ అణచివేతకు పాల్పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి కోసం కాకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారు. జేబులు నింపుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. కరోనా సమయంలో విపరీతంగా కరెంట్ బిల్లులు వేశారు. రావాల్సిన బిల్లు కంటే నాలుగైదు వంతులు అధికంగా బిల్లులు వచ్చాయి. దాంతో పేదల జేబులకు చిల్లులు పడ్డాయి. లాక్డౌన్ తర్వాత రాష్ట్రంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో కరోనా టెస్టులు చాలా తక్కువ చేస్తున్నారు. కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి’ అని ఆయన అన్నారు.

For More News..

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్

బాయ్ ఫ్రెండ్ తో గొడవ.. 30 వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ అద్దం పగులగొట్టిన యువతి

ఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి

Latest Updates