సెక్ర‌టేరియ‌ట్ పైన కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయ‌డ‌మే ల‌క్ష్యం

సెక్ర‌టేరియ‌ట్ పైన కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయ‌డ‌మే ల‌క్ష్యంగా కార్య‌క‌ర్త‌లంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌న్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్మాణికం ఠాకూర్. టీపీసీసీ ఇంచార్జ్ గా నియామకం అయిన అనంతరం మాణికం ఠాకూర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా బుధ‌వారం జూమ్ యాప్ ద్వారా టీపీసీసీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెండు గంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యత్వం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలపై చర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక, మండలి ఎన్నికలకు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాల‌న్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో బూత్, బ్లాక్ కమిటీ లను వెంటనే పూర్తి చేయాల‌ని చెప్పారు. నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు క్రమశిక్షణ చాలా అవసరమ‌ని, సోషల్ మీడియాను ఇష్టానుసారంగా క్రమశిక్షణ లేకుండా వాడుకోవద్దని చెప్పారు. ప్రతి 15 రోజులకొకసారి కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అన్ని అంశాలలో పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని తప్పకుండా పాటిద్దామ‌న్నారు

Latest Updates