ఆర్టీసీ కార్మికుల కోసం కలిసి కొట్లాడుదం రండి

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనేందుకు కలిసి రావాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలకు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మెకు తూతూమంత్రంగా మద్దతు తెలిపిన టీజీవో, టీఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాల నేతలు పోరాట కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసినప్పుడు.. తలూపి పేపర్లలో రాయించుకుంటే సరిపోదన్నారు. ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్‌‌ నెల పనిచేసినా ఇప్పటికీ వారికి వేతనాలు అందలేదని గుర్తుచేశారు. సాటి ఉద్యోగులు చేసిన పనికి జీతం రాకుండా ఉంటే.. మనం సంఘం నాయకులుగా ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మానవీయకోణంలో ఆలోచించి, ప్రత్యక్ష ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

Latest Updates