గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోన సోకింది. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఒళ్ళు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గాంధీభవన్ కు రెగ్యులర్ గా వచ్చే కాంగ్రెస్ నాయకుల్లో నారాయణ రెడ్డి కూడా ఒకరు. ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు జలదీక్ష పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. కానీ, ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో నాయకులంతా గాంధీభవన్ కు చేరుకొని ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో కాంగ్రెస్ నేతలంతా ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల నంచి గాంధీభవన్ కు వచ్చినవారేవరు అనే లిస్టు తీస్తున్నారు అధికారులు.

For More News..

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

శాసనమండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్

కరోనాతో చనిపోయిన పోలీసులకు రూ. 3 లక్షల సాయం ప్రకటించిన ఫార్మా కంపెనీ

Latest Updates