ట్రాక్టర్ బోల్తా : పారిశుద్ధ కార్మికుడు మృతి

tractor-accident-sanitation-worker-death-in-siddipet-district

సిద్దిపేట జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడి పారిశుద్ధ కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో జరిగింది. మర్కుక్ మండలం, ఇప్పల గూడెం గ్రామానికి చెందిన స్యతం(43) ట్రాక్టర్ తో చెత్త తరలిస్తుండగా .. డంపింగ్ యార్డు దగ్గర అదుపు తప్పడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కి తరలించారు. సత్యంకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. అయితే ఇప్పల గూడెం గ్రామంలో గురువారం దుర్గమ్మ జాతర ఉండటంతో.. పండుగ ముందు సత్యం చనిపోవడంతో గ్రామంలో విషాధ చాయలు నెల కొన్నాయి.

Latest Updates