ట్రాక్టర్లు, టూ వీలర్స్ సేల్స్ పరుగు

గ్రామాల ఆదాయాల పెరుగుదలే కారణం

ఈ ఏడాది ఆశించినంత పంట దిగుబడి

ఈసారి వర్షాలూ బాగుండే అవకాశాలు

న్యూఢిల్లీ: లాక్‌‌‌‌డౌన్, ఎకానమీ క్రైసిస్‌ తో దేశవ్యా ప్తంగా వెహికల్స్ అమ్మకా లు విపరీతంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే పరిస్థి తులు మారుతున్నాయని, గ్రామాల ప్రజల ఖర్చు పెరుగుతోందని ఎక్స్‌ పర్టులు చెబుతున్నారు . ట్రాక్టర్, టూవీలర్ అమ్మకా లు పెరిగాయని తెలిపారు. ఎందుకంటే ఈసారి పంట దిగుబడులు భారీగా ఉన్నా యి. దీనివల్ల పల్లెటూళ్ల ఆదాయాలు సహజంగానే పెరిగాయి. రూరల్ డిమాండ్ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటు న్నది. జన్‌‌‌‌ధన్ ఖాతాల్లో డబ్బు వేయడం వంటివి ఇందుకు ఉదాహరణలు. వీటికితోడు ఈసారి వర్షాలు బాగానే పడతాయని కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఇవన్నీ ఆటోమొబైల్స్ కంపెనీల్లో ఉత్సాహం నింపుతున్నాయి. జూన్ క్వా ర్టర్లో ట్రాక్టర్ల అమ్మకా లు రికా ర్డుస్థా యిలో ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ‘‘డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నా యి. రబీ దిగుబడులు ఆశించినట్టే వచ్చాయి. రైతులకు గిట్టుబాటు ధర దక్కింది. గ్రామీణ ప్రాంతాల కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోంది”అని మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్వి ప్‌ మెంట్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకా లు 26 శాతం పెరుగుతాయన్నది తమ అంచనా అని సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ రమన్ మిట్టల్ అన్నారు . టూవీలర్ కంపెనీ హీరో మోటాకార్ప్ కూడా అమ్మకాలు బాగున్నాయని తెలియజేసింది. ప్రతి వారమూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని, దేశవ్యా ప్తంగా అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూ టివ్ చెప్పారు . కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న మహారాష్ట్ర , గుజరాత్ లో మాత్రమే సేల్స్ బాగా లేవని వివరించారు. బిస్కెట్లు , చాక్లెట్లు , సబ్బులు తయారు చేసే కంపెనీలు కూడా సంతోషంగానే కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరగడం వల్ల అమ్మకాలూ పెరిగాయని పార్లే బిస్కెట్స్ వెల్లడించింది. మన దేశ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా రెండు శాతం పాయింట్ల వరకు ఉంటుందని, జీడీపీలో 15 శాతం వరకు ఉంటుందని ఈవై ఇండియా సీనియర్ ఎగ్జిక్యూ టివ్ డీకే శ్రీవాస్తవ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఎకానమీ బలంగా ఉండొచ్చని చెప్పారు.