దొంగ దారిలో చైనా సరుకులు

Traders’ body urges govt to probe Chinese goods imported via hawala route
  • ఖజానాకు భారీ నష్టం
  • ట్రేడర్స్ బాడీ ఆరోపణ

న్యూఢిల్లీ : చైనీస్ ఉత్పత్తులు మన దేశంలోకి అక్రమ మార్గాన(హవాలా మార్గం లో) ప్రవేశిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ కాన్ఫడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆరోపిస్తోంది. అంతేకాక అక్రమ మార్గం లో వస్తోన్న ఈ ఉత్పత్తుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో రెవెన్యూ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అక్రమ మార్గం లో సంపాదించిన ఈ నగదును ఉగ్రవాద కార్యకలాపాల కోసం పాకిస్తాన్‌ కు తరలిస్తున్నారని సీఏఐటీ ఆరోపించింది. ఈ విషయాన్నిప్రభుత్వం సీరియస్‌ గా పరిగణలోకి తీసుకోవాలని, వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ఇండియన్ పోర్ట్‌‌ల వద్ద ఉన్నత స్థాయి లో విచారణ చేపట్టడం ప్రారంభించాలని కోరింది.

‘హవాలా ఆపరేటర్లు ఎవరు? మన దేశం నుంచి చైనాకు నగదు తరలించేది ఎవరు? హవాలా లావాదేవీలు చేపడుతూ ఏ మార్గంలో నగదు బదలాయిస్తున్నారు? మన దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఉన్నత స్థాయిలో ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని ట్రేడర్స్ బాడీ చెప్పింది. ఉగ్రవాదంపై ఇండియా పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరో నిధులు అందిస్తున్నారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులు ఇన్‌ వాయిస్‌ల లో తక్కువ చూపించి, ఉగ్రవాదానికి నిధులు అందిస్తున్నాయని సీఏఐటీ ఆరోపించింది. తక్కువ దిగుమతి సుంకం, తక్కువ ఐజీఎస్టీ వర్తించే వచ్చే చాలా కేసుల్లో, దిగుమతి చేసుకున్న అసలుతో మెటీరియల్ సరిపోలడం లేదని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో, మెటీరియల్‌‌తో పాటు డాక్యుమెంట్ల పరిశీలనను చేపట్టాల్సి ఉందన్నారు.

Latest Updates