జోరు వాన కూడా అతన్నిఅడ్డుకోలేదు

జోరువానలో కూడా బాధ్యతగాడ్యూటీ చేసి సోషల్ మీడియాలో హీరోఅయ్యాడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్. హఠాత్తుగా వర్షం వచ్చినప్పడు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పక్కకో, చెట్టు కిందకో వెళ్లి రెయిన్ కోట్ వేసుకుంటారు. కానీ,అస్సాం కు చెందిన ఒక కానిస్టేబుల్ మాత్రం కుండపోత వర్షం కురిసినా రెయిన్ కోట్ లేకుం డానే ట్రాఫిక్ క్లియర్​ చేశాడు. బసిస్థ చరియాలి ట్రాఫిక్ పాయింట్ వద్ద ఆదివారం ఈ దృశ్యం కనిపించింది. ఈ వీడియోను అస్సాం పోలీస్​ శాఖ ట్విట్టర్​లో పోస్ట్​ చేసిం ది. ‘ఆసమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆయన పక్కకి వెళ్తే వాహనదారులకు ఇబ్బంది అవుతుందని వర్షంలో నిలబడి అలాగే ట్రాఫిక్ క్లియర్​ చేశాడు’ అని అధికారులు తెలిపారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు మిథున్ దాస్​ అని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంపై అస్సాం డీజీపీ కులధర్​ సాయికియా ట్విట్టర్​లో స్పందించాడు. మిథున్ దాస్​ చేసిన పని ఎంతో మంది పోలీసులకు స్ఫూర్తిని ఇస్తుంది అని డీజీపీ ట్వీట్ లో తెలిపాడు. వ్యక్తిగతంగా మిథున్ ను అభినందించారు కూడా.

Latest Updates