ట్రాఫిక్ పోలీసే గుంతలను పూడ్చేస్తున్నాడు

పంజాబ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బటిండాలో విధులు నిర్వహించే గురుభక్ష్ సింగ్ రోడ్లపై పడిన గుంతలను పూడ్చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు  రోడ్లు ధ్వంసమయ్యాయి. గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో ట్రాఫిక్ కానిస్టేబులే రంగంలోకి దిగాడు. మట్టి, ఇటుకలతో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేస్తున్నాడు. గురుభక్ష్ సింగ్ పని తీరును వాహనదారులు అభినందిస్తున్నారు.

Latest Updates