ఇవాళ LB స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ఇవాళ (మంగళవారం) సాయంత్రం నేషనల్‌ ప్రేయర్‌ డే కార్యక్రమం జరగనుంది. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈసందర్భంగా LB స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనీల్‌కుమార్‌ తెలిపారు. వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల ఎంచుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు…

…AR పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి, చాపెల్‌రోడ్‌, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు.
…ఆబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.
…బషీర్‌బాగ్‌ నుంచి GPO, ఆబిడ్స్‌ వైపు వెళ్లే వాహనదారులు బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి హైదర్‌గూడ, కింగ్‌ కోఠి వైపు వెళ్లాలి.
…ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనదారులను హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు అనుమతిస్తారు.
… కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్‌ ద్వారా బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనదారులను కింగ్‌కోఠి క్రాస్‌ రోడ్‌ నుంచి తాజ్‌మహల్‌ లేదా ఈడెన్‌గార్డెన్‌ వైపు మళ్లిస్తారు.

Latest Updates