డీజీపీ కారుకు రూ.1,135 ఫైన్

  •                 రాంగ్ రూట్‌‌లో వెళ్తుండగా ఫొటో తీసిన వ్యక్తి
  •                 వైరల్‌‌ అవడంతో ఫైన్‌‌ వేసిన సంగారెడ్డి పోలీసులు

ట్రాఫిక్​ రూల్స్​ పాటించండి లేకపోతే చలానా ఇంటికి వస్తుంది అని పోలీసులు చెబుతుంటారు. ట్రాఫిక్‌‌ ఉల్లంఘనలకు పాల్పడే వారెవరికీ ఈ రూల్‌‌ నుంచి మినహాయింపు లేదని సంగారెడ్డి పోలీసులు రాంగ్‌‌రూట్‌‌లో  వెళ్లిన డీజీపీ వెహికల్‌‌కు ఫైన్‌‌ వేయడం స్పష్టం చేస్తోంది.  ఈ నెల 3వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఐటిఐ ప్రధాన రహదారిలో పోలీసు వాహనం రాంగ్​ రూట్‌‌లో వెళ్తుండగా ఓ వ్యక్తి ఫొటో తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్తా ట్రాఫిక్​ పోలీసుల దృష్టికి చేరడంతో వారు టీఎస్ 09 పీఏ5121 నంబరు గల పోలీసు వాహనానికి  రూ.1,135 చలాన్​ విధించారు. అయితే ఆ వాహనం రాష్ట్ర డీజీపీ పేరున రిజిస్టర్ అయి ఉండడంతో డీజీపీకి ట్రాఫిక్ ఉల్లంఘన కింద ఫైన్​ వేసినట్టు సంగారెడ్డి పోలీసులు ప్రకటించారు.

Latest Updates