ఆ సారూ మావోడే…!

ట్రాఫిక్ ప్రమాదాల రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ట్రాఫిక్ రూల్స్‌‌ను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని వాహనదారులను కెమెరాతో క్లిక్ మనిపించి జరిమానాలు విధిస్తున్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా.. నలుగురికి క్రమశిక్షణ నేర్పించాల్సిన పోలీస్ అధికారులే ట్రాఫిక్ రూల్స్​పాటించడం లేదు. ఇందుకు నిదర్శణం ఈ చిత్రం.. రూల్స్‌ పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్న ఈ కానిస్టేబుల్.. హెల్మెట్‌‌ లేకుండా తన ముందు నుంచి వెళ్లిన పోలీస్ అధికారి వాహనాన్ని మాత్రం ‘ఆ సారూ మావాడే’ అని వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫొటో గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌‌ వద్ద ‘వెలుగు’ కంటపడింది. ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులు ఎన్ని మొట్టికాయలు వేసినా కింది స్థాయి ఆధికారుల తీరు మారడంలేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Latest Updates