చలాన్లకు బదులు చాక్లెట్లు

    ‘శాంటాక్లాజ్’లుగా మారిన

    గోవా ట్రాఫిక్ పోలీసులు

మామూలుగా అయితే ట్రాఫిక్​ పోలీసులు ఏం చేస్తారు? రూల్స్​ బ్రేక్​ చేసిన వాళ్లకు చలాన్లిస్తారు కదా. కానీ, గోవా రాజధాని పణజీలో మాత్రం కొంచెం కొత్తగా రూల్​ బ్రేకర్లకు చాక్లెట్లు పంచారు. ఏంలేదు, బుధవారం క్రిస్మస్​ సందర్భంగా శాంటాక్లాజ్​లాగా వేషం వేసిన ట్రాఫిక్​ పోలీసులు, రూల్స్​ బ్రేక్​ చేసిన వారికి చలాన్లకు బదులుగా చాక్లెట్లు ఇస్తూ, వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. మోటార్​వెహికిల్ రూల్స్​ను పాటించడం ఎంత ముఖ్యమో వాహనదారులకు వివరించి చెప్పేందుకు వారు ఇలా వెరైటీగా సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు.  ఏ ట్రాఫిక్ రూల్ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్​లో ఎలాంటి గాయాలు, మరణాలు జరిగాయన్నవి వివరించే ఫొటోలు, పోస్టర్లను కూడా ఈ సందర్భంగా వాహనదారులకు చూపించారు. ఆ ఫొటోలను గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. హెల్మెట్లు, సీట్ బెల్టులు పెట్టుకోకపోవడం వల్లే చాలా మంది రోడ్ యాక్సిడెంట్లలో మరణిస్తున్నారని, ఇలా డిఫరెంట్ గా చేపట్టిన సేఫ్టీ డ్రైవ్​తో తాము వాహనదారుల మనసులు గెలుచుకున్నామని పణజీ ట్రాఫిక్ సెల్ అధికారులు వెల్లడించారు. తామిచ్చిన మెసేజ్​ చాలా మందిని ఆలోచింపజేసిందని, ఇకపై సేఫ్​గా డ్రైవ్ చేయాలని, రూల్స్ బ్రేకర్లు నిర్ణయించుకుంటారని కోరుకుంటున్నట్టుతెలిపారు.

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి

Latest Updates