టూ వీలర్స్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల షాక్

టూ వీలర్స్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్‌ ఇస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ఇద్దరికీ హెల్మెట్‌‌ను పోలీసులు తప్పనిసరి చేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమలు చేస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తులకు హెల్మెట్ లేకుంటే రూ.100 జరిమానా విధించి రశీదు చేతుల్లో పెడుతున్నారు. ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాహన దారులు భావిస్తుంటే… పోలీసులు మాత్రం అప్పుడే బాదుడు మొదలు పెట్టేశారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు పోలీసులు.

 

Latest Updates