లాల్‌దర్వాజా బోనాలు..ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ పాత బస్తీలోని లాల్‌దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజా బోనాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లాల్‌దర్వాజా బోనాలకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవాలకు 15వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు.

లాల్‌ దర్వాజా, అంబర్‌పేట మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘాటల ఉరేగింపు జరగనున్నాయి. సోమవారం బోనాల జాతరకు సంబంధించిన ర్యాలీలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నూమా, బహుదూర్‌పుర ప్రాంతాల్లో ఆంక్షలు అమలుల్లో ఉంటాయని తెలిపారు. ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, వారి సూచనలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఆర్టీసీ బస్సులు చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్ షిఫా ఎక్స్ రోడ్స్, ఇంజన్‌బౌలి రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

Latest Updates