జరసోచో : నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు  ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సద్దుల పూల బతుకమ్మ సందర్భంగా చెరువుల వద్ద అన్నీ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలో సద్దుల పూల బతుకమ్మలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.

ఓ వైపు బతుకమ్మ పండుగ, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఇక్కట్లు తప్పేలా లేవని భక్తులు వాపోతున్నారు.

కాగా రేపు సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ ,ఎన్టీఆర్ మార్గ్ రూట్లలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లించనున్నారు. ఈదారిలో వెళ్లే వాళ్లు ప్రత్నామాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

Latest Updates