ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

దుర్గా మాత నిమజ్జనం ఉండటంతో రూట్లు డైవర్ట్

హైదరాబాద్‌, వెలుగు: దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఆది, సోమవారాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నిమజ్జనాలు జరిగే హుస్సేన్‌సాగర్‌ ఎన్ఆర్‌టీ మార్గ్‌, ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అడిషనల్‌ సీపీ, ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ శనివారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎన్ఆర్‌టీ మార్గ్‌, ట్యాంక్‌ బండ్‌ కు ఉత్సవ వాహనాలు మినహా వేరే వెహికల్స్ను అనుమతించమని చెప్పారు.

డైవర్షన్స్‌ చేసిన రూట్స్‌
ఖైరతాబాద్‌ ఫై ఓవర్‌‌ నుంచి ఎన్టీఆర్‌‌ మార్గ్‌ వైపు అనుమతి లేదు.
నిరంకారీ మీదుగా వాహనాల మళ్ళింపు.
లిబర్టీ,తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఎన్టీఆర్‌‌ మార్గ్‌కు నో ఎంట్రీ
ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, లక్డీకపూల్‌ మీదుగా డైవర్ట్‌
సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలు చిల్డ్రన్స్‌ పార్క్‌, లోయర్‌‌
ట్యాంక్ బండ్‌ మీదుగా వెళ్లాలి.

For More News..

దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ

టీఆర్‌‌ఎస్ కార్యకర్తలకే 10 వేలు ఇస్తున్నరు

కొన్ని దేశాల ఆర్మీలు పవర్ ఫుల్ అన్నది భ్రమే!

Latest Updates