కాలువలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ఎస్సై

అమరావతి: కాలువలో కొట్టుకుపోతున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఎస్సై.  విజయవాడకు సమీపంలోని బందరు కాలువలో అదుపుతప్పి పడిపోయిన ఓ మహిళను ట్రాఫిక్‌ ఎస్సై అర్జునరావు ప్రాణాలకు తెగించి కాపాడాడు . ఆ దారిలో వెళుతున్న ఎస్సై .. ఆమెను గమనించి వెంటనే ఏం ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం గురించి తెలుసుకున్న డీజీపీ గౌతం సవాంగ్  అర్జునరావు ధైర్యసాహసాలకు అభినందనలు తెలిపారు. అర్జునరావు పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు నామినేట్ చేస్తున్నామని చెప్పారు.

Latest Updates