డియర్‌‌‌‌ సిటిజన్స్‌‌..బీ అలర్ట్​

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్ యాక్సిడెంట్స్ నివారణ, రూల్స్ గురించి పోలీసులు ప్రచారం చేసేవారు. ఇప్పుడు కరోనా ప్రికాషన్స్ వినిపిస్తున్నారు. సిటీలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులతో పబ్లిక్‌‌ అడ్రెసింగ్‌‌ సిస్టమ్‌‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, ఆటో స్టాండ్స్, కూరగాయల మార్కెట్ల వద్ద మైకులతో సేఫ్టీ ప్రికాషన్స్ అనౌన్స్‌‌ చేస్తున్నారు. 2 నిమిషాలపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో ఆడియో మెసేజ్ వినిపిస్తున్నారు. వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే 60 జంక్షన్లలో ప్రతి చోటా 4 మైక్ లు ఏర్పాటు చేసి.. ఫేస్‌‌ మాస్క్​లు, ఫిజికల్‌‌ డిస్టెన్సింగ్‌‌, హైజెనిక్‌‌ ఫుడ్, కరోనా సింప్టమ్స్​ తదితర అంశాలపై అవేర్​నెస్​ కల్పిస్తున్నారు. వెహికల్ మూవ్‌‌ మెంట్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో టైమ్‌‌తో కూడిన షెడ్యూల్‌‌ ఫిక్స్ చేశారు.

సికింద్రాబాద్ లో 40 కరోనా కేసులు

Latest Updates