ప్రాణం తీసిన ట్రాఫిక్ చలానా వ్యవహారం

నోయిడా : ట్రాఫిక్ చలానాకు సంబంధించి పోలీసులతో గొడవకు దిగి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నోయిడాకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోమవారం సాయంత్రం తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తుండగా..పోలీసులు లాఠీలతో కారుపై కొడుతూ డాక్యుమెంట్లు చూపించాలన్నారు.

దీంతో అతడు పోలీసులతో వాగ్వాదానికి  దిగగా..హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. స్థానికులు వెంటనే హస్పిటల్ కి తీసుకెళ్లగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. పోలీసు దురుసుగా ప్రవర్తించినందుకే తమ కుమారుడు చనిపోయాడని కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు.

Latest Updates