వినాయక నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు మృతి

కృష్ణాజిల్లా : వినాయకుడి నిమజ్జనంలో అపశృతి జరిగింది.  విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఏ-కొండూరులో తండాలో జరిగింది.

శనివారం అర్ధరాత్రి వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండావాసులు సమీప చెరువుకు వెళ్లారు. నిమజ్జన చేసే ప్రదేశం లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు నీటిలో మునిగి ఊపిరి ఆడక ప్రాణాలు వదిలారు. చనిపోయిన వారిలో బాణవతు గోపాలరావు,భూక్యా శంకర్, భూక్యా చంటి ఉన్నార. ఈ సంఘటన గురించి సమాచారమందుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులోకి దిగి మృతదేహాల కోసం గాలింపు  చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ అతి కష్టం మీద ఆ ముగ్గురు యువకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.

Latest Updates