పాపం చిన్నపిల్లోడు: నీళ్లనుకుని యాసిడ్ తాగి మృతి

శంషాబాద్ : శంషాబాద్ పట్టణంలో విషాదం జరిగింది. తల్లిదండ్రుల అజాగ్రత్త ఫలితంగా.. ఏడాది వయసున్న బాలుడు చనిపోయాడు. హైమాద్ నగర్ కాలనీకి చెందిన ఉస్మాన్.. వారి ఇంటికి సున్నం వేయడం కోసం ఇంట్లోని వస్తువులను ఒకపక్కకు సర్దుకున్నారు. అయితే ఉస్మాన్ కుమారుడు ఆజాం(12నెలలు)…. నీళ్లు అనుకొని ఓ బాటిల్ లో ఉన్న యాసిడ్ తాగాడు.

ఏడుస్తున్న కుమారుడిని గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బుధవారం సాయంత్రం నుంచి.. గురువారం సాయంత్రం వరకు ట్రీట్ మెంట్ అందించారు డాక్టర్లు. అయినా ఫలితం లేకపోయింది.. చిన్నారి నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆక్రందనకు అంతులేకుండాపోయింది.

 

Latest Updates