మిస్సింగ్ కేసులో విషాదం : కనిపించకుండా పోయిన వ్యక్తి లాడ్జిలో..

రంగారెడ్డి జిల్లా: మిస్సింగ్ కేసులో విషాదం చోటుచేసుకుంది. 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై కనిపించాడు. ఈ సంఘటన శుక్రవారం సికింద్రాబాద్ లో జరిగింది. హయత్ నగర్ కు చెందిన సైదులు అనే వ్యక్తి రెండు రోజుల నుండి కనిపించడంలేదు. దీంతో గురువారం సైదులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే సికింద్రాబాద్ లోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి ఉరేసుకున్నాడని పోలీసులకు తెలిసింది. సంఘటనా స్ధలానికి చేరున్న పోలీసులు.. మృతుడిని తప్పిపోయిన సైదులుగా గుర్తించారు. అయితే సైదులు సూసైడ్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బజాజ్ కంపనీలో  రికవరీ ఏజెంట్ గా సైదులు జాబ్ చేసేవాడని..  రికవరీ డబ్బుల వ్యవహారంలో బజాజ్ కంపెనీ అధికారులు ఒత్తిడి చేసేవారని సైదులు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడికి మూడు నెలల కూతురితో పాటు ఓ బాబు ఉన్నారు. సైదులు మరణవార్త తెలిసిన భార్య, ఫ్యామిలీ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హస్పిటల్ కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సైదులు మృతిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్

Latest Updates