11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మన దేశంలో విడుదల చేయబోయే ఫోన్ నంబర్ల సంఖ్యను 11కు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది.

మన దేశంలో 117కోట్ల మంది సెల్ ఫోన్లు, కోటి మంది ల్యాండ్ లైన్ నెంబర్లు వినియోగిస్తున్నారు. దీంతో రేడియేషన్ ఎక్కువై అనారోగ్య సమస్యలతో పాటు కనెక్టివిటీ సమస్యలు ఎక్కువయ్యాయి.

దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు 10 సెల్ ఫోన్ నెంబర్లకు బదులు 11నెంబర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. 10 సెల్ ఫోన్ నెంబర్ల స్థానంలో 11 నెంబర్లు, డాంగిల్ సిమ్ లకు 13 నెంబర్లకు పెంచుతున్నట్లు  ట్రాయ్ తెలిపింది.

అయితే ట్రాయ్ సూచనలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కోట్లాది మంది సెల్ ఫోన్ నంబరును ఫీడ్ చేసుకోకుండానే నేరుగా డయల్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కొత్తగా మరో నంబర్ ను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మరికొన్ని కొత్త సమస్యలకు దారి తీసే ప్రమాదముంది. దీంతో ఆపరేటర్లు వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Latest Updates