లక్ష్మీస్ ఎన్టీఆర్: నా జీవితంలో వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. ‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’.. అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల జీవితంలో జరిగిన ఎన్నో ఎమోషనల్ సీన్స్‌ను ఈ టీజర్‌ లో చూపించారు. ఎన్టీఆర్‌‌ పై చెప్పులు విసరడం.. తర్వాత ఆయన ఇంటికి వచ్చి కుప్పకూలిపోవడం వంటి ఎమోషనల్ సీన్స్‌ ను వర్మ చూపించారు. ‘నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నేను నమ్మడం’ అంటూ ఎన్టీఆర్ కన్నీళ్లతో చెప్పడంతో ట్రైలర్ పూర్తవుతుంది.

ఆస‌క్తికరంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. ఈ మూవీలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌నున్నారు.

Latest Updates