ఆన్​లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్​ మరింత కాస్ట్‌‌‌‌లీ

న్యూఢిల్లీ: ఆన్​లైన్లో  రైల్వే టికెట్ల బుకింగ్​మరింత ప్రియం కానుంది. రిజర్వేషన్లు, ఈ టికెట్ల బుకింగ్​పై సర్వీస్​చార్జ్​ విధించాలని ఐఆర్​సీటీసీ నిర్ణయించింది. నాన్​ఏసీ టికెట్లపై రూ.15, ఏసీ టికెట్లపై రూ.30 వసూలు చేయనుంది. రైల్వే బోర్డు.. ఐఆర్​సీటీసీ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీంతో సెప్టెంబర్​1 నుంచి సర్వీస్​చార్జ్​వసూలు చేయనున్నట్లు ఐఆర్​సీటీసీ ఓ ప్రకటనలో  పేర్కొంది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నట్లు వివరించింది. సర్వీస్​చార్జ్ ను రైల్వే​గతంలో కూడా వసూలు చేసింది. మూడేళ్ల క్రితం వరకూ నాన్​ఏసీ టికెట్లపై రూ.20, ఏసీ టికెట్ల బుకింగ్​పై రూ.40 వసూలు చేసింది.

 

 

Latest Updates