ఏడాదిలో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు రైలు: హరీశ్

ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు రావాలంటే TRSకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు . సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపూర్‌ మాదిరిగా నారాయణరావుపేటను మారుస్తామన్నారు. జూన్‌ తొలివారంలో మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చేలా ఆదర్శ మండలంగా తయారు చేస్తామన్నారు. నారాయణరావుపేట మండలంలోని 5వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఏడాదిలో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు రైలు వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తెస్తున్నామన్నారు. ఆర్థికంగా మహిళా సంఘాలు ఎదిగేలా కృషి చేస్తామన్నారు హరీశ్.

Latest Updates