బస్సును ఢీకొన్న రైలు.. మూడు ముక్కలైన బస్సు

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం రాత్రి సింధ్ ప్రావిన్స్‌లోని రోహ్రీ రైల్వే స్టేషన్ సమీపంలో అతివేగంగా ప్రయాణిస్తున్న రైలు, పట్టాలు దాటుతున్న ప్యాసింజర్ బస్సును ఢీకొన్నట్లు సమాచారం. బస్పు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులున్నారు. గాయపడిన వారిని రోహ్రీ మరియు సుక్కూర్ ఆస్పత్రులకు తరలించినట్లు సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మహేసర్ తెలిపారు. రావల్పిండి నుండి కరాచీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు కంధ్రా రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. బస్సు సుక్కూర్ నుంచి పంజాబ్ వెళ్తుందని.. రైలు ఎక్కువ స్పీడ్‌తో ఉండటం వల్ల బస్సు మూడు ముక్కలైందని ఆయన తెలిపారు. రైలు వేగానికి బస్సు దాదాపు 200 మీటర్ల వరకు ముందుకెళ్లిందని ఆయన తెలిపారు. బస్సులోని సీట్లు కూడా ఊడిపోయి రోడ్డున పడ్డాయంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితుల్లో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రులకు తరలించేటప్పుడు చనిపోయారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల ప్రాణనష్టం ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

For More News..

మార్చిలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది

కరోనా ఎఫెక్ట్: ఒక్కో మాస్క్ రూ. 4 లక్షలు

Latest Updates