ట్రైనీ ఐపీఎస్ మోసం… భార్య ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు

trainee-ips-maheshwar-reddy-wife-complaint-on-her-husband

న్యాయం కోరి పోలీసుల దగ్గరికి వెళ్తే చులకనగా మాట్లాడారు…
సెటిల్ చేసుకోమంటున్నారు…
సీపీ మహేష్ భగవత్ పట్టించుకోలేదు… ట్రైనీ ఐపీఎస్ ను ఇబ్బంది పెట్టొందన్నాడు
ఏసీపీ శివకుమార్  చులకనగా మాట్లాడాడు:  ట్రైనీ ఐపీఎస్ భార్య భావన

ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పారు అతని భార్య భావన. బుధవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె… ఏడాదిన్నర క్రితం మహేశ్వర్ రెడ్డి తనూ ప్రేమించి పెండ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఉస్మానియా యునివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నామని… తర్వాత కీసర రిజిస్టార్ ఆఫీస్ లో తమ కుటుంబసభ్యుల మధ్య పెండ్లి చేసుకున్నట్లు చెప్పారు. అయితే మహేశ్వర్ ఇంట్లో పెండ్లి విషయాన్ని చెప్పలేదని తెలిపారు. మహేశ్వర్ ఐపీఎస్ అయ్యాక తనను పట్టించుకోవడంలేదని.. విడాకులు ఇచ్చేందుకు చూస్తున్నాడని చెప్పారు.

డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రదిస్తే… సీపీ మహేష్ భగవత్ ను కలవమన్నారని తెలిపింది భావన. మహేష్ భగవత్ మాత్రం పట్టించుకోలేదని.. పైగా మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ అని అతన్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పినట్టు చెప్పారని అన్నారు. కుషాయిగూడా ఏసీపీని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని… చెప్పారు. తాను సోషల్ మీడియాలో బాధను వ్యక్త పరచగా.. నామ మాత్రంగా కేసులు మాత్రమే పెట్టారని చెప్పారు.

 ఏసీపీ శివకుమార్ ను కలిస్తే చులకనగా మాట్లాడి.. ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవాలని చెప్పినట్లు భావన చెప్పారు. పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదని అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యలను కలిశానని.. తనకు తన భర్త కావాలని, కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు భావన.

Latest Updates