కలెక్టర్లు, ఆర్వోలకు ఇవాళ, రేపు ఎన్నికల శిక్షణ

బేగంపేట టూరిజం ప్లాజా హోటల్ లో  అన్ని జిల్లాల కలెక్టర్ లు(డీఈవో), ఆర్వోల సమావేశం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అధ్యక్షతన ఈ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతోంది. డీఆర్ఓలైన కలెక్టర్లు, ఆర్వోలకు ఇవాళ, రేపు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎన్నికల మానిటరింగ్ పై మాస్టర్స్ ట్రైనర్స్, నోడల్ ఆఫీసర్… వీరికి శిక్షణ ఇస్తారు.

ఆర్వోలకు ఎగ్జామ్ పెడతామని.. ఎగ్జామ్ లో పాసైన వారికి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు సీఈఓ రజత్ కుమార్. ఫెయిల్ అయిన వారికి మళ్ళీ 20న ఢిల్లీ లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు.

మంగళవారం రోజున విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను మర్యాద పూర్వకంగా కలిశాననీ.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించానని చెప్పారు రజత్ కుమార్.

Latest Updates