కరోనా వల్ల దేశవ్యాప్తంగా పలు రైళ్ల బంద్

సౌత్​ సెంట్రల్​ రైల్వేలో..మరో 42 రైళ్లు రద్దు

దేశవ్యాప్తంగా 84 రైళ్లు..

హైదరాబాద్‌, వెలుగు: కరోనా వైరస్‌ ఎఫెక్ట్​తో మరో 42 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్‌– ధనపూర్‌, ఏప్రిల్‌ 8 నుంచి 15 వరకు విల్లుపురం – సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ – సికింద్రాబాద్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మరికొన్ని రైళ్లను ప్రధాన నగరాల మధ్య నుంచి వెళ్లకుండా మార్చినట్టు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు 84 రైళ్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ రైళ్లలో టికెట్లు బుక్​ చేసుకున్న ప్యాసింజర్లు అందరికీ వ్యక్తిగతంగా సమాచారం ఇస్తున్నామని, పూర్తిగా రీఫండ్​ ఇస్తామని వెల్లడించాయి. తక్కువ ఆక్యుపెన్సీ, కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన రైళ్ల సంఖ్య 155 కి పెరిగినట్టు అధికారు లు చెప్పారు.

50 శాతం టికెట్లు క్యాన్సిల్‌!

సౌత్  సెంట్రల్  రైల్వే పరిధిలో 50 శాతం టికెట్లు క్యాన్సిల్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో పలు రైళ్లను రద్దుచేశామని తెలిపారు. గత మూడు రోజులుగా రోజుకు 50 చొప్పున సుమారు 150 రైళ్ల దాకా రద్దయ్యాయి. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ ట్రైన్లతోపాటు రెగ్యులర్ ట్రైన్లు కూడా అందులో ఉన్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లే రైళ్లను ఎక్కువగా నిలిపివేశారు.

For More News..

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు

Latest Updates